
21న జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా స్థాయి సీనియర్స్ పురుషులు, సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ జట్లను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆదివారం ఉదయం పది గంటలకు ఎంపిక చేయనున్నామని అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, కార్యదర్శి కామేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్ జూనియర్స్ బాలబాలికలు 2011, జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్‌తో పాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని, వివరాలకు 97036 54315, 80742 99640 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
డిజిటల్ మారథాన్‌లో భాగస్వాములుకండి
నెల్లూరు రూరల్: ఆంధ్ర యువ సంకల్ప్ రాయబారి డిజిటల్ మారథాన్‌లో యువత భాగస్వాములు కావాలని సెట్నెల్ ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు తమ పేర్లను ఈ నెల 30లోపు నమోదు చేసుకోవాలని కోరారు. 120 సెకన్ల నిడివి గల వీడియో పార్ట్‌లను అధికారిక హ్యాష్‌ట్యాగ్‌తో సొంత సోషల్ మీడియా ద్వారా చేయాలని సూచించారు. ఎంట్రీలను జ్యూరీ సమీక్షించి, ఉత్తమమైన వాటిని షార్ట్ లిస్ట్ చేసి విజేతలను ప్రకటించనుందని వివరించారు. మొదటి మూడు బహుమతులుగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలను అందజేయడంతో పాటు తొమ్మిది మంది విజేతలను ఆంధ్ర యువత బ్రాండ్ అంబాసిడర్‌గా సత్కరించనున్నామని ప్రకటించారు. పాల్గొన్న అందరికీ డిజిటల్ క్రియేటర్ ఏపీ 2కే25 సర్టిఫికెట్లను అందజేయనున్నామని తెలిపారు.
ఐ అండ్ పీఆర్ డీడీ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు రూరల్: జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలను వేణుగోపాల్‌రెడ్డి బుధవారం స్వీకరించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏడీగా ఉన్న ఆయన్ను ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమించారు.
11 బార్లకు
దరఖాస్తుల దాఖలు
నెల్లూరు(క్రైమ్): బార్లకు దరఖాస్తుల దాఖలుకు గడువును పొడిగించినా, వ్యాపారుల స్పందన నామమాత్రంగానే ఉంది. జిల్లాలో 33 బార్లకు రీనోటిఫికేషన్‌ను ఎకై ్సజ్ అధికారులు ఈ నెల మూడున జారీ చేశారు. ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ విధానాల్లో 14వ తేదీ సాయంత్రం ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. లాటరీ డ్రాను 15న నిర్వహించాల్సి ఉంది. అయితే 11వ తేదీ నాటికి కేవలం ఐదు బార్లకే దరఖాస్తులొచ్చాయి. దీంతో స్వీకరణ గడువును బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించారు. ఈ క్రమంలో చివరి రోజు నాటికి నెల్లూరులోని ఆరు బార్లకు 24.. కావలిలోని మూడింటికి 12.. బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పంచాయతీల్లోని రెండింటికి ఎనిమిది దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు పది బార్లకు 44 దరఖాస్తులొచ్చాయి. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో కలెక్టర్ సమక్షంలో లాటరీ డ్రాను గురువారం ఉదయం తొమ్మిది గంటలకు తీయనున్నారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం అ ధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 63,607 మంది దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.