
నాటుసారా బట్టీపై దాడులు
ఉదయగిరి: మండలంలోని దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీని సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. బట్టీ గురించి తెలుసుకున్న పోలీసు, అటవీ, ఎక్సైజ్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సారా తయారీకి నిల్వ ఉంచిన 200 లీటర్ల బెల్లం ఊటను పారబోశారు. అలాగే సారా తయారీకి గారికి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. సామగ్రిని ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. బట్టీ నిర్వహణలో ఎవరి హస్తముందో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు కె.ఇంద్రసేనారెడ్డి, ఎ.శ్రీను, ఎకై ్సజ్ ఎస్సై దీప్తి కరంత్, అటవీ శాఖ సిబ్బంది వెంకటేశ్వర్లు, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.