
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అన్ని సమస్యలే..
● సమస్యలు పరిష్కారమయ్యే వరకు
పెన్‌డౌన్ కొనసాగిస్తాం
● డాక్యుమెంట్ రైటర్లు
నెల్లూరు సిటీ: డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాఫ్ట్‌వేర్ కొత్త అప్‌డేట్ కారణంగా రైటర్లు, క్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటీపీ, ఆటోమ్యుటేషన్ సమస్యలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యంతోపాటు పదేపదే వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజి స్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని డాక్యుమెంట్ రైటర్లు సోమవారం పెన్‌డౌన్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు దీనిని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్‌రిజిస్ట్రార్ విజయరాణికి వినతిపత్రం అందజేశారు.
99 మాత్రమే..
డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్‌డౌన్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.70 లక్షలు వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీంతోపాటు వివిధ సేవలకు రూ.కోటి ఆదాయం వస్తుంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 90 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆర్‌ఓ కార్యాలయంలో 9 మాత్రమే నమోదయ్యాయి. మొత్తంగా రూ.30 లక్షలు మాత్రమే ఆ శాఖకు ఆదాయం వచ్చింది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అన్ని సమస్యలే..