
అధికారులు స్పందించాలి
ఓటీపీ, ఆటోమ్యుటేషన్ల విధానాల కారణంగా డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీలు పదేపదే అప్‌లోడ్ చేయడం ద్వారా క్రయదారులు అకౌంట్‌లోని తమ డబ్బులు పోతాయని భయాందోళనకు గురవుతున్నారు. అదే విధంగా సర్వర్ సమస్యతో ఆలస్యమవుతుంది. అధికారులు త్వరితగతిన స్పందించి సమస్యలు పరిష్కరించాలి. లేనిపక్షంలో పెన్‌డౌన్ కొనసాగుతుంది.
– పట్నం దుర్గేష్‌బాబు, దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
అప్‌డేట్ చేస్తేనే..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సమస్య ఉంది. కొత్తగా అప్‌డేట్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను పునరుద్ధరించాలి. క్రయదారులకు ఆలస్యం కాకుండా, సులువైన పద్ధతిలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
– పీవీ సుబ్బారావు, డాక్యుమెంట్ రైటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
అసహనానికి గురవుతున్నారు
క్రయదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తుంటారు. ఈ క్రమంలో స్లాట్‌ల ద్వారా తమ రిజిస్ట్రేషన్లు చేయించుకునే సమయంలో పదేపదే ఓటీపీలు అడగడం, సర్వర్ సమస్యతో ఆలస్యం కావడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. డాక్యుమెంటర్ రైటర్లపై ఒత్తిడి పడుతుంది.
– జేబీవీ అశోక్, డాక్యుమెంట్ రైటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నగరాధ్యక్షుడు
●

అధికారులు స్పందించాలి

అధికారులు స్పందించాలి