
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
అక్రమ కేసులు పెట్టడం దారుణం
●
ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేస్తున్న మీడియా రంగాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసేలా చర్యలు చేపట్టడం సరికాదు. గతంలో ఏ ప్రభుత్వాల్లోనూ ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, చేస్తున్న మోసాలను, వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తుందనే ‘సాక్షి’ మీడియా ఎడిటర్, విలేకరులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ప్రభుత్వ చర్యలు, తప్పులను తప్పుగా పత్రికలు ఎత్తిచూపడాన్ని ప్రస్తుత పాలకులు ఓర్చుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో ఒకటిగా పరిగణింపబడే మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేయడం నిరంకుశత్వానికి నిదర్శనం. పోలీస్ అధికారుల హక్కులను కాపాడేందుకే రాసిన కథనంపై ‘సాక్షి’పై అక్రమ కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజాస్వామ్యవాదులు ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించాలి.
– బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ
కూటమి ప్రభుత్వం అరాచకాలు, అక్రమాలపై ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్కసుతో అక్రమ కేసులు పెట్టడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను, జర్నలిస్తుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే.. పోలీసులు అందుకు వంతపాడడడం శోచనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థకు నాల్గో స్తంభమైన మీడియాలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి. కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ వెలుగులోకి తెస్తోంది. దీంతో ఆ పత్రిక ఎడిటర్, జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులతో అక్రమ కేసులు పెట్టడం దారుణం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం ఇటువంటి కక్షపూరిత చర్యలకు పాల్పడలేదు.
– ఆనం విజయకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి

పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు

పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు