
రక్తమోడేలా పోలీసుల లాఠీచార్జి
● మాజీమంత్రి నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్‌రెడ్డి
● గాయపడిన కార్యకర్తలకు పరామర్శ
ఇందుకూరుపేట: టీడీపీ గూండాలు నా ఇంట్లో చేసిన విధ్వంసం తర్వాత నా కుటుంబాన్ని పరామర్శించేందుకు మా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 31న నెల్లూరుకు వచ్చిన సందర్భంలో తమ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు రక్తమోడేలా లాఠీచార్జి చేశారని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన సోమవా రం మండలంలోని మైపాడు, నాగరాజుతోపు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ప్రసన్న పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారా? పోలీ సుల విధులకు అడ్డుపడ్డారా? పోలీసులు ఎందుకు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే తమ పార్టీ కార్యకర్తలు అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. ఆస్పత్రుల్లో చికి త్స పొందాల్సి వచ్చిందన్నారు. గాయపడిన ప్రతి కార్యకర్తను వారి ఇళ్లలోనే కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పార్టీ తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. ప్రసన్న రాకతో ఆయా గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, ఏపీఎల్‌డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్ర రెడ్డి, మైపాడు సర్పంచ్ వెంకయ్య, నియోజకవర్గ వైఎస్సార్ టీయూ అధ్యక్షుడు బిరదవోలు రూప్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రక్తమోడేలా పోలీసుల లాఠీచార్జి