
పత్రికా స్వేచ్ఛపై దాడి
●
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాలకులు చేసే తప్పులు, పొరపాట్లను ప్రజలకు చేరవేయడంలో పత్రికలది ప్రధానపాత్ర. ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ అవినీతిని, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు వాస్తవాలను చేరవేస్తుందనే అక్కసుతో ‘సాక్షి’పై కక్ష సాధింపునకు దిగడం సరైన విధానం కాదు. ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమంగా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేసి వాస్తవాలను బయటకు రాకుండా చేయాలనే కుట్రను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే. దేశంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం పత్రికలపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. ప్రభుత్వ పెద్దలు ‘సాక్షి’ పత్రిక, సిబ్బందిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.
– బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే

పత్రికా స్వేచ్ఛపై దాడి