
ఈ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకం
● వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం దళితులకు వ్యతిరేకమని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా సమావేశమైనట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా రూ.2.75 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందిస్తే అందులో రూ.50 వేల కోట్లు మాల, మాదిగ, రెల్లి కులస్తులకు వివిధ పథకాల ద్వారా అందాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం సూపర్‌సిక్స్ అమలు చేస్తామని ఆయా సామాజికవర్గాల వారికి హామీ ఇచ్చారన్నారు. ఏడాదిగా రూ.10 వేల కోట్లు మాల, మాదిగ, రెల్లి కులస్తులకు బాబు బాకీ పడ్డారన్నారన్నారు. ఉచిత బస్సు తమ కులాలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదన్నారు. సూపర్‌సిక్స్‌ను తొలి ఏడాది అమలు చేయకపోవడంతో నష్టం వాటిల్లిందన్నారు. రెండో ఏడాదిలో అమలు చేస్తున్న పథకాల్లో వారికి భాగస్వామ్యం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పిల్లలు మంచి బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారన్నారు. దళితులంటే కోపం కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవేవీ లేకుండా పోయాయన్నారు. దళితులను ఉక్కుపాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా అన్యాయం చేశారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కె.కనకారావు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.