
ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్నికలు ఏకగ్రీవం
● అల్లంపాటికే రెండో దఫా అధ్యక్ష పదవి
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ విభాగాల్లో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఆదివారం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని ఏపీఆర్‌ఎస్‌ఏ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్‌రెడ్డి ఎన్నికల అధికారిగా, శివప్రసాద్ సహాయ అధికారిగా, గోపీనాథ్‌రెడ్డి పరిశీలకులుగా ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 2 గంటల వరకు స్క్రూట్నీ నిర్వహించారు. 24 పదవులకు 24 మంది మాత్రమే నామినేషన్లు వేయడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించిన ఎన్నికల అధికారులు ఉత్తర్వులు అందజేశారు.
కార్యవర్గం ఇలా..
ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడిగా రెండో దఫా కూడా నుడా సెక్రటరీగా పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ అల్లంపాటి పెంచలరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న యెడ్ల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా చేజర్ల తహసీల్దార్ మురళి, ఉపాధ్యక్షులుగా కోవూరు సీఎస్ డీటీ బాలకోటమ్మ, వరికుంటపాడు తహసీల్దార్ హేమంత్‌కుమార్, వింజమూరు సీఎస్ డీటీ శ్రీనివాసులు, మర్రిపాడు తహసీల్దార్ అనిల్‌కుమార్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా నెల్లూరు అర్బన్ ఈడీటీ ఆనందరావు, జాయింట్ సెక్రటరీలుగా మనుబోలు తహసీల్దార్ రమాదేవి, ఇందుకూరుపేట డీటీ శ్రీకాంత్‌రెడ్డి, టీపీ గూడూరు ఆర్‌ఎస్ డీటీ అశోక్‌వర్ధన్, కలెక్టరేట్ ఓఎస్ నుంచి అలరేష్, కోశాధికారిగా వెంకటాచలం ఆర్‌ఎస్ డీటీ సతీష్‌కుమార్, ఈసీ మెంబర్లుగా యూత్ వెల్ఫేర్ డీటీ గయాజ్ అహ్మద్, కందుకూరు సీఎస్ డీటీ చెంచురామయ్య, కావలి ఆర్‌ఎస్ డీటీ నరసారెడ్డి, డీఎస్‌ఓ ఆఫీసు నుంచి సందానీ, కందుకూరు సీనియర్ అసిస్టెంట్ కోటయ్య, అనంతసాగరం డీటీ శేషయ్య, కొడవలూరు సీనియర్ అసిస్టెంట్ మస్తాన్‌బాబు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా మనుబోలు డీటీ ప్రదీప్, దుత్తలూరు డీటీ లక్ష్మి, నెల్లూరు రూరల్ నుంచి కృష్ణప్రసాద్ వ్యవహరిస్తారు. వారి చేత ఎన్నికల అధికారులు ప్రమాణం చేయించారు.
పోరాటం చేస్తాం
ఈ సందర్భంగా అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నికలు రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతను చాటాయన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, డీఏ, పీఆర్సీ, ఇతర సమస్యలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. రెండో దఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీఆర్‌ఎస్‌ఏ ఎన్నికలు ఏకగ్రీవం