
హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని యునైటెడ్, మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నగరంలోని ఏసీఎస్సార్ మెడికల్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాల కమిటీ మహాసభను శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనంగా రూ.26 వేలను చెల్లించాలని కోరారు. పీఆర్సీని తక్షణమే ప్రకటించి.. మధ్యంతర భృతిని ఇవ్వాలన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన కమ్మటి శ్రీనివాసులు, కవి మోపూరు పెంచలనరసింహాన్ని సత్కరించారు.
నూతన కార్యవర్గ ఎన్నిక
ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా నరమాల సతీష్‌కుమార్, గౌరవ సలహాదారుగా కమ్మటి శ్రీనివాసులు, అధ్యక్ష, కార్యదర్శులుగా ఉరూజ్, సందానీబాషా, అసోసియేట్ ప్రెసిడెంట్లుగా ప్రసన్నకుమార్, పార్థసారథి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శ్రీనివాసరావు, రవీంద్రరాజు, కోశాధికారిగా గౌడ భాస్కర్, ఉపాధ్యక్షులుగా రాజ్‌కుమార్, రవివందన్, కామాక్షయ్య, సహాయ కార్యదర్శులుగా రీటా, తిరుపతి, జబ్బార్, కార్యవర్గ సభ్యులుగా కుమార్, అనీష్, అస్లామ్, వెంకటేశ్వర్లు, సునీతమ్మ, సావిత్రి, తిరుమలేష్, వెంకటరత్నం ఎన్నికయ్యారు.