
డీఎస్సీ ‘కీ’లో తప్పులు
● పరీక్ష నిర్వహణలో అలసత్వం
● ప్రాథమిక ‘కీ’ అస్తవ్యస్తం
● తుది దశలోనూ అదే దుస్థితి
● అభ్యర్థుల ఆందోళన
సంగం: డీఎస్సీ పరీక్షలను నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలిస్తామని కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన ఏడాది అనంతరం నిర్వహించి మమ అనిపించింది. అయితే పరీక్ష పత్రం, ‘కీ’లో తప్పులు దొర్లడంపై డీఎస్సీ రాసిన వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్ 16న పరీక్షను నిర్వహించిన విద్యాశాఖ ప్రాథమిక ’కీ‘ని జూలై రెండున విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను తెలియజేసేందుకు జూలై 12 వరకు గడువిచ్చింది. దీనిపై అప్పట్లోనే ఎంతో మంది అభ్యంతరాలను తెలియజేశారు. పరిష్కా రంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్ట్ ఒకటిన విడుదల చేసిన ‘కీ’లో సైతం తప్పులు దొర్లడంతో అభ్యర్థులు తలలు పట్టుకొని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖకు శాపనార్థాలు పెడుతున్నారు. నిర్లక్ష్యంతో తమ భవిష్యత్తు దెబ్బతింటుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ స్పందించాలని అభ్యర్థిస్తున్నారు.
తప్పులు సరిచేయాలి
సాంఘిక శాస్త్రంలో డీఎస్సీ పరీక్షను రాశాను. ప్రాథమిక కీలో తప్పులు దొర్లాయి. తుది కీలో సరిచేస్తారని భావించినా అది జరగలేదు. ఇప్పటికై నా న్యాయం చేయాలి.
– మురళి, గాంధీజనసంఘం
●

డీఎస్సీ ‘కీ’లో తప్పులు