
అవగాహనతో చెక్
రక్తనాళాల్లో రక్తప్రససరణ తగ్గితే వచ్చే మార్పులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అధిక బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసేవారు వాస్క్యులర్‌సర్జన్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ప్రధానంగా 45 సంవత్సరాలు నిండిన వారు క్రమం తప్పకుండా రక్తప్రసరణకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. లక్షణాలున్నట్టు గుర్తిస్తే చికిత్స పొందాలి. దీంతో కాళ్లు, వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఉండదు. ప్రారంభంలోనే గుర్తిస్తే కేవలం మాత్రల ద్వారానే వాస్క్యులర్ సమస్యలు తగ్గించవచ్చు. రోజూ కనీసం 20 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానం నిలిపి వేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగు పరుచుకోవచ్చు.
– డాక్టర్ వై.సుదర్శన్‌రెడ్డి, వాస్క్యులర్ సర్జన్, మెడికవర్ ఆస్పత్రి