
ఎల్లో మీడియాది దుష్ప్రచారం
కందుకూరు: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన నల్లపరెడ్డి అజిత్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకుడంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అజిత్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోసం ఉలవపాడు మండలంలో అనుచరులతో కలిసి ప్రచారం నిర్వహించారన్నారు. తెలుగుదేశం అభ్యర్థుల కోసం పనిచేశారనేది బహిరంగ రహస్యమేనన్నారు. అతను అజిత్‌కుమార్‌రెడ్డి ఏడాదిన్నర కాలంగా వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉంటున్నారని, ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్‌ను అతను ఇప్పటి వరకు కలిసిన దాఖలాల్లేవని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం మాని వాస్తవాలు తెలుసుకో వాలన్నారు. సమావేశంలో కార్యక్రమంలో ఉలవపాడు మండలాధ్యక్షుడు నన్నం పోతురాజు, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెలిచర్ల ధనకోటి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు పాలవల్లి అమరనాథరెడ్డి, యువజన అధ్యక్షుడు మద్దసాని నవీన్‌కృష్ణయాదవ్, సోషల్ మీడియా అధ్యక్షుడు కాపులూరి మధుసూదన్, సీనియర్ నాయకులు అమ్మనబ్రోలు బ్రహ్మయ్య, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఆలూరి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
అజిత్‌కుమార్‌రెడ్డి టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేశాడు
విలేకరుల సమావేశంలో
వైఎస్సార్‌సీపీ నేతలు