
20 చోట్ల ఎంఈఓలే దిక్కు
జిల్లాలో 3,221 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఫౌండేషన్ స్కూల్స్–968, బేసిక్ ప్రైమరీ స్కూల్స్–1187, మోడల్ ప్రైమరీ స్కూల్స్–594, అప్పర్ ప్రైమరీ స్కూల్స్–79, హైస్కూల్స్–288, హైస్కూల్స్ (బీపీఎస్)–74, హైస్కూల్స్ (ఎంపీఎస్) 31 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 20 మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓ–1లుగా ఉన్నారు. నెల్లూరు రూరల్, వెంకటాచలం, మనుబోలు, సైదాపురం, కందుకూరు, వలేటివారిపాళెం, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వరికుంటపాడు, జలదంకి, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం, కలువాయి మండలాల్లో జిల్లాలోని మిగిలిన మండలాల్లో ఉండే ఎంఈఓలు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేరుకే ఎంఈఓ–2లు ఉన్నా వారంతా ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షి స్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బోధన, పర్యవేక్షణ, నిర్వహణ అంతా ఎంఈఓ–1లు చూసుకోవాల్సి ఉంటుంది.