
గత ప్రభుత్వంలో సజావుగా..
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా పరిణమించింది. ఓ వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేకపోవడం.. మరో వైపు ఎరువుల కృత్రిమ కొరతతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అన్నదాతా సుఖీభవ, పంట నష్టపరిహారం తదితరాలు సక్రమంగా అందక వారు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో మూడు లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల పైర్లను వేశారు. దీంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ముఖ్య డీలర్లు జిల్లాకు వచ్చిన యూరియాను తమ ఆధీనంలో ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించారు. డిమాండ్‌ను బట్టి అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వాస్తవానికి బస్తా యూరియా ధర రూ.266 కాగా, రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. వింజమూరు, కలిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో రూ.350కు.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.400 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు.
సరఫరా అయింది సగమే..
జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న వివిధ పైర్లకు వ్యవసాయాఽఽధికారుల సిఫార్సు మేరకు 90 వేల టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే నేటికి ఇందులో సగమే వచ్చింది. వీటిని కొంతమంది డీలర్లు బ్లాక్ చేస్తున్నారు.
సాగులో ఉన్న వరి
ఈ చిత్రంలో కనిపిస్తున్న పేరం విష్ణు వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన రైతు. మూడెకరాల్లో వరిని సాగు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పైర్లకు అవసరమైన కాంప్లెక్స్, యూరియా ఎరువులు గ్రామంలోని ఆర్బీకేలో లభించేవి. అయితే ప్రస్తుతం ఇవి రాలేదు. దీంతో సమీపంలోని పట్ణణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. రవాణా రూపంలో ఒక్కో బస్తాకు రూ.50 చొప్పున వెచ్చిస్తున్నారు. యూరియాను రూ.350కు కొనుగోలు చేస్తున్నారు. గతంలో దీన్ని రూ.266కు ఇంటి వద్దే పొందేవారు.
గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలిచారు. సీజన్‌కు ముందే సాగు విస్తీర్ణానికి సరిపడా ఎరువులను సిద్ధం చేసేవారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన ఎరువులను గ్రామాల్లో సరఫరా చేశారు. నకిలీ ఎరువులను వ్యాపారులు విక్రయించకుండా, అధిక ధరలకు అమ్మకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గతేడాది రబీ సీజన్లో వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచి రూ.ఐదు కోట్ల భారాన్ని అన్నదాతలపై మోపారు. ఈ ఖరీఫ్ సీజన్లోనూ వీటిని తగ్గించలేదు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరాను కూటమి ప్రభుత్వం నిలిపేసింది. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి యూరియాకు కృత్రిమ కొరత సృష్టించిఽ ధరలు పెంచి దోచుకుంటున్నారు.
యూరియా కృత్రిమ కొరత
ధరలు పెంచి దోచుకుంటున్న వ్యాపారులు
చోద్యం చూస్తున్న వ్యవసాయాధికారులు
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. జిల్లాలో ఈ సీజన్లో సాధారణం కంటే రెట్టింపు స్ధాయిలో వరిని సాగు చేశారు. నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తంలో యూరియాను వేస్తున్నారు. దీంతో కొంత సమస్య ఉంది. మరో ఎనిమిది వేల టన్నుల యూరియా త్వరలో రానుంది. వీటిని సొసైటీ, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతాం. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు.
– సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి

గత ప్రభుత్వంలో సజావుగా..

గత ప్రభుత్వంలో సజావుగా..

గత ప్రభుత్వంలో సజావుగా..