
వైఎస్సార్ జయంతి సందర్భంగా..
● నెల్లూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం నెల్లూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ పార్టీ సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నాయకులు, యువజన విభాగం నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడని చెప్పారు.