
రాజకీయ చరిత్రలో చీకటి రోజు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు రాజకీయ చరిత్రలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటన చీకటి రోజు అని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే తప్ప ఇళ్లపై దాడులు చేయడం దారుణమని, హేయమన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకాణి పూజిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉలికిపడింది : అనిల్‌కుమార్
విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే తప్ప ఇళ్లపై దాడులు సమాధానం కాదు
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు దారుణం, హేయం
మాజీమంత్రి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు