
మహిళ మెడలో గొలుసు చోరీ
నెల్లూరు(క్రైమ్): ఉక్కపోతగా ఉండటంతో తలుపును దగ్గరగా వేసి వివాహిత తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. వివరాలు.. జనార్దన్‌రెడ్డికాలనీలోని లక్ష్మీపార్వతినగర్‌లో సురేంద్ర, సౌమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వరండాలో ఆయన.. కుమార్తెతో కలిసి ఇంట్లో ఆమె నిద్రించారు. ఉక్కపోతగా ఉండటంతో తలుపును దగ్గరకు వేశారు. ఈ తరుణంలో ఇంట్లోకి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించి, ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును కట్ చేసి తీసుకెళ్తుండగా, అలికిడైంది. బాధితులు నిద్ర నుంచి లేచేసరికే నిందితుడి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుడి కోసం చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లభించలేదు. కాగా ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
యాచకుడి మృతి
వలేటివారిపాలెం: అనారోగ్యంతో యాచకుడు మృతి చెందిన ఘటన వలేటివారిపాళెంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మరిడినాయుడి వివరాల మేరకు.. ఉప్పలపాడు సమీపంలోని కస్తూర్బా విద్యాలయం పక్కన ఉన్న కాలనీలో నివసిస్తూ గురునాథం నాగరాజు (30) భిక్షాటన చేసుకుంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. అంత్యక్రియల నిమిత్తం గ్రామస్తులు చందాల రూపంలో మృతుడి బంధువులకు సహకరిస్తున్నారు.
సవక తోట దగ్ధం
సైదాపురం: విద్యుత్ తీగలు తెగి మంటలు చెలరేగడంతో పదెకరాల్లో సవక తోట దగ్ధమైన ఘటన మండలంలోని గిద్దలూరులో ఆదివారం చోటుచేసుకుంది. రైతుల వివరాల మేరకు.. మండలంలోని గిద్దలూరులో కంభం శ్రీకాంత్, మరో ఐదుగురు రైతులు సుమారు వందెకరాల్లో సవక తోటలను సాగు చేస్తున్నారు. సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. తరచూ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి రాసుకొని మంటలు వ్యాపిస్తుంటాయి. ఈ తరుణంలో విద్యుత్ వైర్లు రాసుకొని మంటలు చెలరేగి సవక తోటలోకి వ్యాపించాయి. సుమారు పదెకరాల్లో సవక తోట కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.ఐదు లక్షల మేర నష్టం సంభవించిందని రైతులు తెలిపారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారానికి 30.316 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగకు 2050, పిన్నేరుకు 100, లోలెవల్‌కు 70, హైలెవల్‌కు 15, మొదటి బ్రాంచ్ కాలువలకు 65 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.

మహిళ మెడలో గొలుసు చోరీ

మహిళ మెడలో గొలుసు చోరీ