
మీకు అండగా మేముంటాం
● కరేడు రైతులకు ఎమ్మెల్సీ తూమాటి హామీ
ఉలవపాడు: కరేడు ప్రాంత రైతుల పోరాటానికి అండగా ఉంటామని, మీకు అన్యాయం జరగకుండా అన్ని వేదికల్లో మాట్లాడుతామని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హామీ ఇచ్చారు. ఆదివారం కరేడు పంచాయతీ పరిధిలోని టెంకాయచెట్లపాళెం, కొత్తపల్లెపాళెం, చినపల్లెపాళెం, చైతన్యనగర్, కరేడు, పెద్దపల్లెపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించి గ్రామ ప్రజలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మీ పోరాటంలో మేము ముందుంటాము.. పచ్చని పంటలు పండుతున్న భూములు తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞపి చేస్తాను. నెల్లూరు జిల్లా డీఆర్సీ సమావేశం, శాసనమండలిలో ప్రభుత్వం ఏకపక్ష వైఖరిపై ప్రశ్నించమే కాకుండా రైతుల గుంతుకై అభిప్రాయాలను తెలియజేస్తామన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని పోరాడుతామన్నారు.
సముద్రాన్ని వదిలి మేము వెళ్లలేం
టెంకాయచెట్లపాళెం మత్స్యకారులు మాట్లాడుతూ సముద్రాన్ని వదిలి మేము వెళ్లం. ముఖ్యమంత్రి వచ్చినా భూములు ఇవ్వం, ప్రాణాలైనా వదులుకుంటామంటూ తూమాటికి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే జైజవాన్, జైకిసాన్ అని అంటారు. ఇప్పుడు కిసాన్‌ను వెళ్లిపామ్మంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయమో ఆలోచించండని తెలిపారు. తాము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా లేమన్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదన్నారు. రైతుల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, రైతు ఉద్యమ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ సయ్యద్ ఫజుల్, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాదర్‌బాషా, ఎంపీటీసీలు రాధామాధవి, రమణయ్య, మాజీ సర్పంచ్ కృష్ణారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనివాసమూర్తి, మోహన్‌బాబు, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, రవికాంత్, మహీధరరెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.