
సాక్ష్యాలు, ఆధారాలు చూపకుండా అక్రమ కేసులు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: ‘నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా నాపై నిందారోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని అక్రమ కేసులు బనాయించారు. ఎకై ్సజ్‌శాఖ అధికారులు రెండు రోజుల కస్టడీ విచారణ సమయంలో ఏ ఒక్క సాక్ష్యాన్ని, ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు. అంటే ఇది అక్రమ కేసేనని తేలిపోతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎకై ్సజ్ అధికారులను నిలదీసినట్లు సమాచారం. ముత్తుకూరు మండలం పంటపాళెంలో మద్యం అక్రమ నిల్వల కేసులో ఆదివారం పోలీసు శిక్షణా కేంద్రంలో కాకాణిని రెండో రోజు ఆయన తరఫు న్యాయవాది కె. శ్రీనివాసరావు సమక్షంలో ఇందుకూరుపేట ఎకై ్సజ్ అధికారులు 24 ప్రశ్నలు వేసి విచారించారు. ఆయా ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానమిచ్చారు. తప్పుడు ఫిర్యాదులు, అక్రమ కేసు అని ఇప్పటికే పలుమార్లు చెప్పినా పదేపదే అవే ప్రశ్నలు లెవనెత్తడం దారుణమని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ఏ మాత్రం వాస్తవాలు లేవని, ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని నాతోపాటు మీ అందరికీ తెలుసని, మద్యం అక్రమ నిల్వల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు దాని పర్యవసనాలు ఏవి నాకు ఆపాదించవు. కేవలం కక్ష పూరితంగానే ఈ కేసు నమోదు చేశారంటూ కాకాణి ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎకై ్సజ్ అధికారులు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో విధులు నిర్వర్తించారు. తాను ఎకై ్సజ్ అధికారులను ప్రభావితం చేశామని పేర్కొనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంపై ఎకై ్సజ్ అధికారులే సమాధానం చెబితే బాగుంటుందని కాకాణి పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో నేను చేసిన అభివృద్ధి, మేము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని ప్రచారం చేశాను. విచారణకు తాను ఎప్పుడూ సిద్ధం. రెండు రోజుల కస్టడీలో సంబంధం లేని విషయాలపై పదేపదే ప్రశ్నించారు. నాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం, ఆధారం లేదు. కస్టడీలో ఉన్నప్పుడే మిగిలిన నిందితులుగా పేర్కొన్న వారిని, ఫిర్యాదుదారుడిని పిలిపించి ఉంటే అసలు ఫిర్యాదుదారుడు నాకు పరిచయం ఉన్నాడా? లేదా అనే విషయం అర్థమయ్యి ఉండేదని ఎకై ్సజ్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా ఎవరో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పట్టుకుని ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్ అని ఎకై ్సజ్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది.
ముగిసిన కాకాణి పోలీస్ కస్టడీ విచారణ
నెల్లూరు (లీగల్): ముత్తుకూరు మండలం పంటపాళెంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండు రోజుల ఎకై ్సజ్ పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. కోర్టు అనుమతితో జిల్లా కేంద్ర కారాగారం నుంచి ఇందుకూరుపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. జైలు సమీపంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో కాకాణి తరఫు న్యాయవాది సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, మధ్యవర్తులు వీఆర్వోలు శ్రీపతి మునిరాజు, చల్లా సూర్యకుమార్ సమక్షంలో కాకాణిని ఇందుకూరుపేట ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ జీవీ ప్రసాద్‌రెడ్డి రెండో 24 ప్రశ్నలు అడిగారు. కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నెల్లూరు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల ఉత్తర్వులు మేరకు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
నా రాజకీయ ప్రత్యర్థుల కక్ష సాధింపు చర్యలే
ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో
ఏ మాత్రం వాస్తవాల్లేవు
పంటపాళెం మద్యం కేసు విచారణలో కాకాణి సమాధానాలు