
కరేడు రైతులకు అండగా నిలవాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
కందుకూరు: బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కరేడు గ్రామ రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం శ్రేణులు ప్రత్యక్షంగా మద్దతు తెలిపి అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సీపీఎం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కృషి చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కె.అజయ్‌కుమార్ మాట్లాడుతూ సీపీఎం, సీఐటీయూ శ్రేణులు నిరంతరం రైతుల వెంట ఉండి వారికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, గుడ్లూరు, ఉలవపాడు మండలాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శులు జీవీబీ కుమార్, ఎస్‌ఏ గౌస్, నాయకులు మాదాల రమణయ్య, దువ్వూరి జాన్, పొందూరి కొండమ్మ, పొన్నం రామలక్ష్మమ్మ, కత్తి సుజాత, ఎం.లలితమ్మ, దాసరి రామ్మూర్తి, ఎస్‌కే మున్వర్ సుల్తానా, టి.వెంకట్రావు, ఎస్‌కే మల్లిక, ఎం.పద్మ, షేక్ ఆస్మా, అనూరాధ, పొట్లూరి రవి పాల్గొన్నారు.