
క్షతగాత్రుడికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర గాయాలతో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్‌కుమార్‌ను వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యులతో మాట్లాడారు. క్షతగాత్రునికి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు. వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, నాయకులు అశోక్, లోకేష్, వెంకట్, ఖాదర్, చంద్ర, ప్రసన్న, మీరా పెంచలయ్య, ప్రసాద్‌లు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు.