
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలోని కుల్లూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కుల్లూరు నుంచి కమ్మవారిపల్లికి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని రాపూరు వైపు నుంచి ఉప్పలపాడు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108లో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను అనంతసాగరం మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన మల్లికార్జున, పోలిరెడ్డి ప్రభాకర్, మద్దెల మయాంక్‌రెడ్డి, కొమ్మి సుధాకర్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం