
ప్రసన్న చేతికి ఆపరేషన్
కోవూరు: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతికి గురువారం నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చిన్నపాటి ఆపరేషన్ చేశారు. 15 రోజులపాటు విశ్రాంతిలో ఉండాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు కలిసేందుకు రావొద్దని ప్రసన్న కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
కాలువలో మృతదేహం
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవి కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రైల్వే ప్లాట్‌ఫారంపై
వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): అనారోగ్యమో?, ఇతర కారణమో తెలియదు గానీ నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై గుర్తుతెలియని వ్యక్తి గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. బులుగు రంగుపై పసుపు గళ్లు కలిగిన ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బులుగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.
కండలేరులో
42.490 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 42.490 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,250, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 60, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రసన్న చేతికి ఆపరేషన్