
జీవనోపాధి కోల్పోతాం
నేను నాలుగేళ్ల నుంచి ఎండీయూ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ప్రజలకు ప్రతి నెల 16వ తేదీ వరకు బియ్యం, ఇతర సరుకులను ఇళ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నాం. బండి ద్వారా నాకు, నా హెల్పర్‌కు జీవనోపాధి లభిస్తోంది.
– అనిల్ రాజు, ఎండీయూ ఆపరేటర్, సీతారామపురం బిట్–2
ప్రభుత్వం ఉపాధి చూపించాలి
ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ చేశారు. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించు కుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మా ట్లాడడం సరికాదు. ముందు బ్యాంకుల నుంచి ఎన్‌ఓసి ఇప్పించి జీవనోపాధి చూపించాలి.
– పెంచలప్రసాద్, ఎండీయూ ఆపరేటర్, చిన్ననాగంపల్లి
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి మా జీవితాలను రోడ్డున పడేలా తీసుకున్న ప్రభుత్వం నిర్ణయం సరికాదు. మా జీవితాలను రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదు. ఎండీయూ వాహనం ద్వారా వస్తున్న ఆదాయంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాం.
– సునీల్, ఎండీయూ ఆపరేటర్, గంగవరం

జీవనోపాధి కోల్పోతాం

జీవనోపాధి కోల్పోతాం