
క్రస్ట్‌గేట్ల నుంచి డెల్టాకు నీరు నిలిపివేత
సోమశిల జలాశయం
● ఉత్తరకాలువకు
100 క్యూసెక్కుల నీరు పెంపు
సోమశిల: సోమశిల జలాశయం నుంచి డెల్టాకు తాగు, సాగుని ఇటీవల 6వ క్రస్ట్‌గేట్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువ డెల్టా ప్రాంతాల వారికి సరిపడా నీరు చేరి ఒత్తిడి తగ్గడంతో అదనంగా క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదల చేసిన నీటిని బుధవారం నిలిపివేశారు. పవర్ టన్నెల్ ద్వారా డెల్టాకు నీరు విడుదలవుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర కాలువ కింద రైతాంగం అవసరాలకు 100 క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 45.375 టీఎంసీల నీరు నిల్వ ఉందని, పైతట్టు ప్రాంతాల నుంచి 150 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుందన్నారు. పెన్నా డెల్టాకు పవర్ టన్నెల్ ద్వారా 3200 క్యూసెక్కులు, 17, 18 రివర్స్ స్లూయిజ్ ద్వారా లీకేజీ 30 క్యూసెక్కులు, ఉత్తరకాలువకు 200, దక్షిణ కాలువకు 50 క్యూసెక్కుల వంతున దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గేట్ ద్వారా నీరు నిలిపివేయడంతో ఆప్రాన్ మీదుగా వాహనాలను అనుమతిస్తున్నట్లు జలాశయ ఈఈ శ్రీనివాసులు తెలిపారు.