మైనింగ్‌, బెట్టింగ్‌లపై విచారణ జరిపించే దమ్ముందా | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌, బెట్టింగ్‌లపై విచారణ జరిపించే దమ్ముందా

May 22 2025 12:25 AM | Updated on May 22 2025 12:25 AM

మైనింగ్‌, బెట్టింగ్‌లపై విచారణ జరిపించే దమ్ముందా

మైనింగ్‌, బెట్టింగ్‌లపై విచారణ జరిపించే దమ్ముందా

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌

నిష్కళంక నాయకుడు

రూప్‌కుమార్‌.. వీపీఆర్‌ డూప్‌

బెట్టింగ్‌ గాళ్లు.. కేటుగాళ్లతో

మాట్లాడిస్తున్నారు

రాష్ట్ర సంగీత అకాడమీ

మాజీ చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరిషా

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో అక్రమ మైనింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌పై అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే దమ్ము.. ఈ కూటమి నాయకులకు ఉందా? అని జెడ్పీ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్‌పర్సన్‌ పొట్టేళ్ల శిరిషా సవాల్‌ విసిరారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అబద్ధాలను.. నిజాలుగా చెప్పే టాలెంట్‌ ఉన్న రూప్‌కుమార్‌ వీపీఆర్‌ డూప్‌ అని విమర్శించారు. సైదాపురంలో అక్రమ మైనింగ్‌పై ఆధారాలతో మా నాయకుడు, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ బహిర్గతం చేస్తే.. ఏ ఒక్క దానికై నా మైనింగ్‌ డాన్‌, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిజాలపై మాట్లాడే దమ్ము, చావ లేక.. చిల్లరగాళ్లు, బెట్టింగ్‌ గాళ్లు, కేటుగాళ్ల చేత మాట్లాడిస్తున్నార ని విమర్శించారు. అక్రమ మైనింగ్‌లో ఈ బెట్టింగ్‌ రాయుడు రూప్‌కుమార్‌కు సంబంధం ఉంది కాబట్టే ఆయన డాన్‌ వీపీఆర్‌కు వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. వీపీఆర్‌ బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నారని, ఆయనే సమాధానం చెప్పాలన్నారు. అయితే ఈ బెట్టింగ్‌ రాయుడి ఆరాటం ఏమిటో తెలియడం లేదన్నారు. రూ.వేల కోట్లు దోచుకుని రూ.లక్ష దానం చేస్తే దైవాంశ సంభూతులుగా మారిపోతారా? అని ప్రశ్నించారు. వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నారని మాట్లాడితే సమాధానం చెప్పలేక నిష్కళంక నాయకుడు అనిల్‌కుమార్‌పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ విషయంలో సీఐ దుర్గాప్రసాద్‌ పట్టుకు ని కొడితే అనిల్‌పై నింద వేశావన్నారు. బెట్టింగ్‌పై విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. పశువుల సంతకు రూ.కోటి లంచం తీసుకున్నారని మరో నింద వేశావు. గట్టిగా అరిస్తే అబద్ధాలు నిజమవుతా యా అని నిలదీశారు. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రి నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలను నిరూపించగలవా అని సవాల్‌ విసిరారు. కార్యకర్త బాలకృష్ణారెడ్డి అప్పుడు, ఇప్పుడు మీ ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడని, అయినా అతని ఇంటిని కూలగొట్టించావు, పైగా అనిల్‌కుమార్‌ పరామర్శించలేదని మాట్లా డడానికి సిగ్గుపడాలన్నారు. అనిల్‌కుమార్‌ దయతో మూలాపేటలో ఇల్లు కట్టుకున్నావు. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ వీపీఆర్‌ పంచన చేరావన్నారు. అనిల్‌కుమార్‌ నెల్లూరు వదిలి పోలేదని, జగనన్న ఆదేశిస్తే నరసరావుపేటకు వెళ్లారన్నారు. రక్తాలు చిందించి అనిల్‌ని గెలిపించానని మాట్లాడుతున్నారని, ఆయనది రాజకీయ కుటుంబం, మీరు ఆయన్ని ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం లేదన్నారు. మొదటగా మైనింగ్‌ మీద విచారణ జరిపించాలని, తొలుత ఐదు మైన్లపై విచారణ జరగాలని, అన్ని అకౌంట్లు మీ మీదే ఉన్నాయన్నారు. ఇవన్నీ విచారణ చేస్తే మొట్టమొదటగా ఇరుక్కునే రూప్‌కుమారే అని అన్నారు. ప్రభుత్వం మీదే అయినప్పుడు విచారణకు అంగీకరించాలని, బెట్టింగ్‌పైనా విచారణ జరపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement