
కాలం చెల్లిన మందులపై నివేదికకు ఆదేశాలు
ఉదయగిరి: ఉదయగిరి మండలం గండిపాలెం ఆరోగ్యకేంద్రంలో కాలం చెల్లిన మందులను మరుగుదొడ్ల గదుల్లో వేయడంపై శనివారం ’సాక్షి’లో వార్త రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు స్పందించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత వైద్యాధికారిణికి ఆదేశాలు ఇచ్చారు. అయితే మందులు పంపిణీ చేయకపోవడానికి ముఖ్య కారణమైన ఫార్మసిస్టు జిల్లా వైద్యఆరోగ్య కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ఉంటూ వారానికి ఒకసారి వస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. వాస్తవంగా ఆ శాఖలో అన్ని రకాల డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. అయినా ఫార్మసిస్టు ఇంకా ఎందుకు జిల్లా కార్యాలయంలో ఉన్నారో అంతుబట్టని ప్రశ్న. జిల్లా ఆఽధికారులు వెంటనే ఆ డిప్యుటేషన్ రద్దు చేసి గండిపాలెం పీహెచ్‌సీ విధులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.