
ప్రసన్నతో అనిల్ మర్యాదపూర్వక భేటీ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ శనివారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలపైన, పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, సీనియర్ నాయకులు కలువ బాల శంకర్ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, నెల్లూరు నగర కార్పొరేటర్ నీలి రాఘవ తదితరులు పాల్గొన్నారు.