
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట
● నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
సైదాపురం: ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని నేదురుమల్లి బంగ్లాలో శుక్రవారం సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం జగనన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాసంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేడర్, వలంటీర్ల వ్యవస్థీకరణకు అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు. అధిష్టానం వెంకటగిరిని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు రవికుమార్ యాదవ్, కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.