
ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..
● కొడుకా.. నువ్వులేని జీవితం మాకెందుకు..
● స్నేహితులారా..
మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..
● కడసారి చూసేందుకు
తరలివచ్చిన మెడికోలు
● తల్లిదండ్రులు, కుటుంబ
సభ్యులతో మిన్నంటిన రోదనలు
● ఘోర రోడ్డు ప్రమాదంలో
ఐదుగురు మెడికోలు మృతి..
కోమాలో మరొకరు
నెల్లూరు(అర్బన్)/కోవూరు: నెల్లూరు పెద్దాస్పత్రిలో తల్లిదండ్రులు, స్నేహితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. నారాయణ మెడికల్ కళాశాల లో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న మెడికోలు ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన చూసిన పలువురి కళ్లలో నీళ్లు తిరిగాయి. కళాశాలలో మెడిసిన్ చదువుతున్న తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి పలువ ు రు మెడికోలు కార్లలో బుచ్చిరెడ్డిపాళెం వెళ్లారు. తిరిగి ఒక కారులో ఆరుగురు వస్తుండగా కోవూరు మండలంల పోతిరెడ్డిపాళెం మలువు వద్ద వేగంగా నడుపుతున్న కారును అదుపు చేయలేకపోయారు. రోడ్డు పక్కనే ఉన్న చిల్లర దుకాణంలోకి దూసుకెళ్లింది. క్షణాల్లోనే ఘోర ప్రమాదం జరిగిపోయింది. దుకాణం యజ మాని నందిగంట వెంకటరమణయ్య (58)తో పాటు మరో ముగ్గురు మెడికోలు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరులో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరూ మృతి చెందారు. వీరిలో వీరమల్లు నవనీత్ శంకర్ కోమాలో పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది.
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
జీజీహెచ్ మార్చురీలో ఐదుగురు మెడికోలు ఖీమావత్ అభిషేక్‌రాజ్ (20), గుండాల జీవన్‌చంద్రారెడ్డి(20), గుర్రం యజ్ఞే శ్ (19), లవదీయ నరేష్‌నాయక్ (20), గోను అభిసాయి పురుషోత్తం(19)తోపాటు వెంకటరమణయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
ఒక్కొక్కరుగా వస్తున్న తల్లిదండ్రులు
విద్యార్థుల స్వగ్రామాలు దూరంగా ఉండడంతో వారు రావడం ఆలస్యమయింది. అయితే జిల్లాలోని సంగం మండలం సిద్దీపురానికి చెందిన గుండాల జీవన్‌చంద్రారెడ్డి తల్లి విజయలక్ష్మి మార్చురీ గది వద్దకు చేరుకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించి సొమ్మసిల్లి పోయింది. మెడికల్ కళాశాల విద్యార్థినులు ఆమెకు దగ్గరగా చేరి ఓదార్చారు. తన బిడ్డలేని జీవితం మాకెందుకంటూ విజయలక్ష్మి రోదిస్తుండడంతో ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఒంగోలుకు చెందిన యజ్ఞేశ్ తల్లి కూడా రాత్రి 7.30 గంటల సమయానికి మార్చురీ వద్దకు చేరుకుంది. బిడ్డా డాక్టర్ అవుతానంటివి కదరా.. ఇంతలోనే తమకు కడుపు కోత మిగిల్చావా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. ఆమె బాధను తీర్చడం ఎవరి వల్ల కాలేదు. పొద్దుపోయాక మిగతా విద్యార్థు ల కుటుంబ సభ్యులు వచ్చి తమ బిడ్డల మృత దేహాలను చూసి విలవిల్లాడిపోయారు.
మేమేమి పాపం చేశాం
పోతిరెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారిని పక్కనే ఇంటినే దుకాణంగా చేసుకుని జీవనం సాగిస్తున్న వెంకటరమణయ్య మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన కోడలు గిరిజ దేవుడు ఇంత శిక్ష విధించాడంటూ రోదించారు.
పోస్టుమార్టం చేయించిన పోలీసులు
ఏఎస్‌పీ సౌజన్యతోపాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు దగ్గర ఉండి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. తొలుత సిద్దీపురం గ్రామానికి చెందిన జీవన్‌చంద్రారెడ్డి భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఒంగోలుకు చెందిన యజ్ఞేశ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా వారి మృతదేహాలను పొద్దుపోయాక వచ్చిన వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
అతివేగంతోనే ప్రమాదం – సౌజన్య, ఏఎస్పీ
అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపారు. అంతలోనే ఘోర ప్రమాదంలో భావి వైద్యులు అసువులు బాసారు. తల్లిదండ్రుల కలలను, ఆశలను చిదిమేసి.. ఆప్తులను వదిలేసి అనంత వాయువుల్లో కలిసిపోయారు. బిడ్డల మరణవార్త తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు కొడుకా.. నువ్వు లేని జీవితం మాకెందుకురా.. పెద్ద డాక్టర్ అవుతానంటివి. అంతలోనే నీకు నూరేళ్లు నిండాయా అంటూ పలువురు తల్లిదండ్రులు పెద్దాస్పత్రి మార్చురీ వద్ద రోధించారు. అరె మామా.. ఒరేయ్.. రారా అంటూ పిలుచుకున్న తమ సహచరులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు తరలివచ్చారు. కొందరు సహచర విద్యార్థినులు బిగ్గరగా ఏడవగా, మరికొందరు విషణ్ణ వదనాలతో కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదంపై ప్రసన్న దిగ్భ్రాంతి
కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మెడికోలు, స్థానికుడైన వెంకట రమణయ్య మృతి చెందిన ఘటనపై మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భావి భవిష్యత్ ఉన్న మెడికల్ విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే ఈ ఘటనలో వెంకట రమణయ్య మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే చిన్నపాటి ఇంటిని ఏర్పాటు చేసుకుని అక్కడే దుకాణం నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటరమణయ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటుని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులు బుచ్చిరెడ్డిపాళెం నుంచి తిరిగి వచ్చే క్రమంలో అతి వేగంగా కారు నడిపారు. కారును నియంత్రించలేక పోయారని భావిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు కళాశాలలో ఒక ముఖ్యమైన తరగతికి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలోనే కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారని అనుకుంటున్నాం. కారు కూడా పూర్తిగా ధ్వంసం అయింది. ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతినింది.

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..

ఆశలు చిదిమేసి.. ఆప్తులను వదిలేసి..