కదల్లేడు.. సాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

కదల్లేడు.. సాయం చేయండి

May 31 2025 12:14 AM | Updated on May 31 2025 12:14 AM

కదల్లేడు.. సాయం చేయండి

కదల్లేడు.. సాయం చేయండి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అతని పేరు మామిడి జీవరత్నం. 30 ఏళ్లుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో గ్రౌండ్‌ మార్కర్‌గా, స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. నేడు ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యాడు. సాయం చేసేవారి కోసం ఎదురు చూస్తున్నాడు.

జీవరత్నం 35 సంవత్సరాల క్రితం రూ.400ల జీతానికి ఉద్యోగంలో చేరాడు. వివిధ కారణాలతో పర్మినెంట్‌ కాలేదు. అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకూ గ్రౌండ్‌లో సున్నపు లైన్లు వేస్తూ, చిమ్ముకుంటూ కష్టపడి పనిచేసేవాడు. 25 రోజుల క్రితం గ్రౌండ్‌లోనే పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ అన్నారు. ఒక్కసారిగా మాటలు పడిపోయాయి. పక్షవాతం వచ్చింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు రూ.10 వేలను రుణంగా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అందుబాటులో ఉన్న వైద్యం చేయించి అతడిని ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు.

మంచంపైనే..

జీవరత్నం భార్య వజ్రమ్మ స్వీపర్‌గా, కుమారుడు ఫ్లెక్సీల దుకాణంలో పనిచేస్తున్నారు. కుమార్తెకు వివాహమైంది. ఆమె భర్త కూడా స్టేడియంలోనే పనిచేస్తాడు. అతడికి జీతం రావడం లేదు. పూట గడవడమే కష్టంగా మారింది. ఈ సమయంలో జీవరత్నం ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇన్నేళ్లు పనిచేసినా ఉద్యోగం పర్మినెంట్‌ కాకపోవడం, ఈఎస్‌ఐ, ఎల్‌ఐసీ తదితర బెనిఫిట్స్‌ లేకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా ఉంది. సంవత్సరం నుంచి స్టేడియంకు వచ్చిన ప్రతిరోజూ సాటి ఉద్యోగులను జీతాలు ఎప్పుడొస్తాయి? అని అడిగి పనిచేసుకుని వెళ్లేవాడు. సిబ్బంది పరిస్థితిని రాష్ట్ర ప్రాధికార సంస్థకు తెలియజేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పైపు ద్వారా అతడికి ఆహారం అందిస్తూ ఎలా కాపాడుకోవాలో అర్థం కాక కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. వాకర్స్‌, అధికారులు, క్రీడాకారులు, దాతలు మానవత్వంతో స్పందించి సహాయం అందించాలని వేడుకుంటోంది.

సాయం చేసేందుకు..

కెనరా బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ :

34622200112565

ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ సీఎన్‌ఆర్‌బీ 0013462

ఫోన్‌ నంబర్‌ : 72868 09519

30 సంవత్సరాలుగా స్టేడియంలో

పనిచేస్తూ..

సంవత్సరంగా జీతం లేదు

కొద్దిరోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌

మంచానికి పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement