
సోమా ఎక్స్‌క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభం
● సింహపురిలో సందడి చేసిన హీరోయిన్ శ్రీదేవి
నెల్లూరు(బృందావనం): అక్షయ తృతీయ సందర్భంగా మాగుంట లేఅవుట్‌లో సీఎంఆర్ జ్యువెలరీ ప్రత్యేక విభాగంలో ‘సోమా ఎక్స్‌క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ’ని కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిలు బుధవారం ప్రారంభించారు. శ్రీదేవి మాట్లాడుతూ సిల్వర్ జ్యువెలరీలో కొరియన్ కలెక్షన్స్ ఎంతో యునీక్‌గా ఉండటమే కాకుండా ఫ్యాక్టరీ ధరలకే కొనుగోలుదారులకు అందజేయడం విశేషమన్నారు. నెల్లూరుకు తొలిసారిగా వచ్చిన తాను కారందోశె రూచి చూశానన్నారు. తమిళంతోపాటు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని శ్రీదేవి చెప్పారు. కోర్టు సినిమాలోని పాటలతో అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. సీఎంఆర్ జ్యువెలరీ అఽధినేత మావూరి శ్రీనివాసరావు, సంతోష్, గణేష్ మాట్లాడుతూ బంగారు ధరలు పెరుగుతున్న కారణంగా సిల్వర్ పూతపై బంగారు పూత, జెర్కాన్స్‌తో తయారు చేసిన సోమా ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మేనేజర్లు వాసు, ప్రసాద్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.
● షోరూంలో పోలీస్ శాఖకు చెందిన శక్తి యాప్ పోస్టర్‌ను శ్రీదేవి ఆవిష్కరించారు.