వైఎస్సార్‌సీపీలోనే మహిళలకు గౌరవం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోనే మహిళలకు గౌరవం

Mar 9 2025 12:11 AM | Updated on Mar 9 2025 12:11 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీలోనే మహిళలకు గౌరవం

నెల్లూరు (బారకాసు): వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు రాజ్యాధికారంలో సముచిత గౌరవాన్ని కల్పించారని, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారతకు తోడ్పాటు అందించారని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం ఆరుణమ్మ తదితరులు గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తోందని విమర్శించారు. శనివారం నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మహిళలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను పార్టీ నాయకులు సత్కరించారు.

మహిళా పక్షపాతి వైఎస్‌ జగన్‌ : కాకాణి

రాజ్యాధికారంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించడంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో వ్యవహరించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. మహిళల గురించి, వారికి అందించిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకునే హక్కు ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందన్నారు. మహిళా దినోత్సవానికి సంబంధించి ర్యాలీని ఆశా, అంగన్‌వాడీ వర్కర్లతో జరుపుకునే దుస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. ఆడబిడ్డ నిధి అడ్రస్‌ లేకుండా పోయిందన్నారు. ఉచిత గ్యాస్‌ తుస్సుమందని, చంద్రబాబు పేరు చెప్పి బస్సు ఎక్కితే ఎక్కిన చోటే దించేస్తున్నారని చెప్పారు.

● పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని మహిళలు లేకుంటే ప్రపంచమే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కు ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతోనే వారికి స్థానిక సంస్థల్లో 50 శాతం కేటాయించడం జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి సంక్షేమం కోసం పోరాటం చేస్తుందన్నారు.

● ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బాధ్యతకు మారు పేరు మహిళ అని కొనియాడారు. విద్యలో మహిళలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించడం జరుగుతుందన్నారు. రాజకీయాల్లో కూడా మహిళలు తమవంతు పాత్ర పోషిస్తున్నారన్నారు.

● జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం ఆరుణమ్మ మాట్లా డు తూ మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందాలని, హక్కులను కాపాడాలని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

● పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం వంద రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. మహిళలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలంటే భవిష్యత్తులో మరలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకురాళ్లు పూజితారెడ్డి, కార్పొరేటర్‌ మొయిళ్లగౌరి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లతోపాటు పలువురు పాల్గొన్నారు.

రాజ్యాధికారం, సంక్షేమంతో సముచిత స్థానం కల్పించిన వైఎస్‌ జగన్‌

పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం

మహిళలను సత్కరించిన పార్టీ నేతలు కాకాణి, ఆనం, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

వైఎస్సార్‌సీపీలోనే మహిళలకు గౌరవం 1
1/1

వైఎస్సార్‌సీపీలోనే మహిళలకు గౌరవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement