గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మహిళకు బుక్‌లెట్‌ అందజేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి - Sakshi

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు: పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కోడూరు బిట్‌–1 గ్రామ సచివాలయ పరిధిలో గురువారం సాయంత్రం మంత్రి కాకాణి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మంత్రి కాకాణి పాముదొరువుకండ్రిగలో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం మండలాధిరులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల వల్ల జరిగిన లబ్ధిని వివరించి బుక్‌లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభించిందన్నారు. గ్రామస్థాయిలోనే ప్రజల అవసరాలను తీర్చేందుకు సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లను నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నడుస్తున్నానన్నారు.

ఆనందంగా రైతులు

ఈ రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి మంచి ధరలు వస్తుంటే ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని మంత్రి కాకాణి అన్నారు. ధాన్యం ధరలు పతనమై రైతులు తిరుగుబాటు చేస్తే అవకాశంగా తీసుకుని అధికార పార్టీపై బురద జల్లాలని టీడీపీ ఆరాటపడుతోందన్నారు. కానీ ప్రస్తుత వైఎస్సార్‌సీపీ పాలనలో సాగునీరందడం, పంటలు పుష్కలంగా పండడం, ధాన్యానికి మంచి ధర వస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ మాత్రం అయోమయంలో పడిపోయిందన్నారు. కావల్‌రెడ్డి సోదరుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శులు ఇసనాక రమేష్‌రెడ్డి, కోడూరు దిలీప్‌రెడ్డి, పార్టీ మండల కన్వీ నర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, నాయకులు కావలిరెడ్డి రవీంద్రారెడ్డి, కావలిరెడ్డి రంగారెడ్డి, కావలిరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, కావలిరెడ్డి సురేంద్రనాఽథ్‌రెడ్డి, కావల్‌రెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్‌ ఎంపీపీ కంజి నీలమ్మ, సర్పంచ్‌ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top