పెళ్లి తర్వాత జీవితం ప్రమాదకరంగా మారుతుంది: ధనశ్రీ | Yuzvendra Chahal And Dhanashree Verma Release Their Wedding Film | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత జీవితం ప్రమాదకరంగా మారుతుంది: ధనశ్రీ

Apr 3 2021 8:26 PM | Updated on Apr 3 2021 9:43 PM

Yuzvendra Chahal And Dhanashree Verma Release Their Wedding Film - Sakshi

యజ్వేంద్ర చాహల్‌-ధనశ్రీ

ముంబై: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ వర్మ శనివారం వారి పెళ్లి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. గతేడాది డిసెంబర్‌లో ధనశ్రీ, చాహల్‌ల వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చాహల్‌ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా పెళ్లి వీడియోను షేర్‌ చేశారు.

ఈ వీడియోకి చాహల్‌ ‘‘ఇద్దరు ఉల్లాసవంతమైన, శక్తివంతమైన వ్యక్తులు కలిస్తే’’ అనే క్యాప్షన్‌ షేర్‌ చేయగా.. ధనశ్రీ ‘‘పెళ్లి తర్వాత జీవితం చాలా ప్రమాదకరంగా మారుతుంది భయ్యా’’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోలో వీరి పెళ్లి తతంగాన్ని చూడవచ్చు. 

ఐపీఎల్‌ 2021లో భాగంగా చాహల్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. ఇక ఏప్రిల్‌ 9 ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. ఐపీఎల్ 2020 లో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు చేరుకుంది. చాహల్‌ మొత్తం 15 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ లెగ్ స్పిన్నర్ 99 ఐపీఎల్ మ్యాచ్‌లలో 121 వికెట్లు తీశాడు. కరోనా వైరస్  కారణంగా 2020 ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో జరిగింది. కానీ ఈ ఏడాది మాత్రం ఇండియాలోనే జరగనుంది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఐపీఎల్‌ 2021 కోసం చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.  

చదవండి: వైరల్‌: చహల్‌ భార్యతో గబ్బర్‌ చిందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement