విజ్డెన్‌ అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు.. కోహ్లికి నో ప్లేస్‌ | Wisden Picks Current Best Test XI, Based On ICC Rankings | Sakshi
Sakshi News home page

విజ్డెన్‌ అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు.. కోహ్లికి నో ప్లేస్‌

Sep 10 2024 3:36 PM | Updated on Sep 10 2024 3:42 PM

Wisden Picks Current Best Test XI, Based On ICC Rankings

ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా విజ్డెన్‌ ఎంపిక చేసిన అత్యుత్తమ టెస్ట్‌ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా విజ్డెన్‌ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి చోటు దక్కకపోవడం విశేషం. ప్రస్తుత ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

వికెట్‌కీపర్‌ కోటాలో పాక్‌ ఆటగాడు, ఐసీసీ పదో ర్యాంకర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మతో (ఆరో ర్యాంక్‌) పాటు ఓపెనర్‌గా స్టీవ్‌ స్మిత్‌ (నాలుగో ర్యాంక్‌) ఎంపికయ్యాడు.

వన్‌ డౌన్‌లో కేన్‌ విలియమ్సన్‌ (రెండో ర్యాంక్‌), నాలుగో స్థానంలో జో రూట్‌ (మొదటి ర్యాంక్‌), ఐదో ప్లేస్‌లో డారిల్‌ మిచెల్‌ (మూడో ర్యాంక్‌), వికెట్‌కీపర్‌గా మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పదో ర్యాంక్‌), ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా (నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌), స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ (నంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌), పేసర్లుగా పాట్‌ కమిన్స్‌ (నాలుగో ర్యాంక్‌), జస్ప్రీత్‌ బుమ్రా (రెండో ర్యాంక్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌ (రెండో ర్యాంక్‌) విజ్డెన్‌ అత్యుత్తమ టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఓవరాల్‌గా చూస్తే విజ్డెన్‌ అత్యుత్తమ టెస్ట్‌ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు,  ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇద్దరు న్యూజిలాండ్‌ ప్లేయర్లు, ఇంగ్లండ్‌, పాక్‌ల నుంచి చెరొకరు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు ఎంపిక కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగానే జరిగింది. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆటగాళ్లను విజ్డెన్‌ తమ అత్యుత్తమ జట్టుకు ఎంపిక చేసుకుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement