విజయం దిశగా న్యూజిలాండ్

హామిల్టన్: బౌలర్లు విజృంభించి ఒకేరోజు 16 వికెట్లు పడగొట్టడంతో.... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 49/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కివీస్ బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. టిమ్ సౌతీ (4/35), జేమీసన్ (2/25), వాగ్నర్ (2/33) హడలెత్తించడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దాంతో న్యూజిలాండ్‌కు 381 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లోనూ విండీస్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 196 పరుగులు చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి