అందుకే మ్యాక్సీ కోసం అంత పట్టుబట్టాం: కోహ్లి

We Targeted Maxwell, At The Auction: Virat Kohli - Sakshi

చెన్నై:  తాము ముందస్తు వ్యూహం ప్రకారమే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ను సొంతం చేసుకున్నట్లు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌  కోహ్లి స్పష్టం చేశాడు. మ్యాక్సీని దక్కించుకోవడం పోటీ ఏర్పడినా అతన్ని దక్కించుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.  మ్యాక్స్‌వెల్‌ కావాలనుకున్నాం కాబట్టే అతన్ని టార్గెట్‌ చేసి వేలంలో పోటీ పడ్డామన్నాడు.  ఆర్సీబీతో కలిసి పనిచేస్తున్న కన్నడ కమెడియన్‌ దానిష్‌ సైట్‌తో ముచ్చటించిన కోహ్లి .. మ్యాక్స్‌వెల్‌ కోసం ఎందుకు పోటీ పడ్డామో వివరించాడు. ఈ మేరకు ఒక వీడియోను ఆర్సీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. 

ఇందులో కోహ్లి మాట్లాడుతూ.. ‘ ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌  విఫలం కావడం చూశాం. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు మ్యాక్సీ సత్తాచాటుకున్నాడు. ఐపీఎల్‌ విఫలం కావడంతో మ్యాక్స్‌వెల్‌ ఎక్కువ దృష్టి సారించిన విషయం మాకు అర్థమైంది. అందుకే ఒక ఆల్‌రౌండర్‌ ఉండాలనే మ్యాక్స్‌వెల్‌పై దృష్టి పెట్టాం. కచ్చితంగా అతన్ని తీసుకోవాలనే డిసైడ్‌ అయ్యాం. దాని కోసమే భారీ ధర చెల్లించి అతన్ని తీసుకున్నాం.  

నాకు తెలిసి ఆర్సీబీకి మ్యాక్సీ ఉపయోగపడతాడనే అనుకుంటున్నా. మా జట్టులో పెద్దగా ఒత్తిడి ఉండదు. ఎందుకంటే చాలామంది మ్యాచ్‌ విన్నర్లు మా జట్టులో ఉన్నారు. ఎవరి పని వారు చేసుకుపోతే ఏ ఒక్క ఆటగాడి మీద ఒత్తిడి అనేది ఉండదు.  నేను మీ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోను. కానీ జట్టులో మ్యాచ్‌ విన్నర్‌గా చూడాలనుకుంటా. అలా అని. అన్నిసార్లు మీపై ఆశలు పెట్టుకోకూడదు.. మ్యాక్స్‌వెల్‌ విషయంలో జరిగిందేదో జరిగింది.. అతను టాలెంట్‌ ఉన్న ఆటగాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు మ్యాక్స్‌వెల్‌ ఆకట్టుకున్నాడు. అందుచేతే అతనిపై ఎక్కువ దృష్టి సారించి వేలంలో దక్కించుకున్నాం’ అని కోహ్లి తెలిపాడు.

ఇక్కడ చదవండి: పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్‌!

ఏం కోహ్లి.. గాల్వాన్‌ ఘటన మరిచిపోయావా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top