టెస్ట్‌ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్దం : కోహ్లీ | Virat Kohli Says We Are Ready For Test Series Against Australia | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ సిరిస్‌కు సిద్ధం : కోహ్లీ

Dec 9 2020 9:09 AM | Updated on Dec 9 2020 12:00 PM

India Tour Of Australia - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నదమవుతున్నట్లు టీమిండియా కెప్టెన్‌ విరాట్ ‌కోహ్లి పేర్కొన్నాడు. మంగళవారం సిడ్ని వేదికగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్‌ ఓడినా 2-1తో తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. లక్ష్యాన్ని చేధించే ‍క్రమంలో టాప్‌ ఆర్డర్‌ రాణించినప్పటికి మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైందని తెలిపాడు. చివర్లో హర్థిక్‌ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నాడు. టీ-20 సిరిస్‌ విజయంతో మరింత ఆత్మవిశ్యాసం పెంపొందించాకున్నామని.. సరైన ప్రణాళికలను రూపొందించి టెస్ట్‌ సిరిస్‌కు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతామని తెలిపాడు. కాగా గతంలో పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉ‍ందన్నాడు. ఆసీస్‌ పర్యటనలో భాగంగా భారత్‌ నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి డే-నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా ప్రారంభం కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement