Virat Kohli Funny Dance Moments After Winning 1st Test vs WI, Video Viral - Sakshi
Sakshi News home page

#ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి

Jul 15 2023 10:14 AM | Updated on Jul 15 2023 11:06 AM

Virat Kohli Funny Dance Moments After Winning 1st Test Vs WI Viral - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకొని విండీస్‌ బ్యాటర్లు విలవిల్లాలాడిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్‌ అయిన విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా ఆడింది. అశ్విన్‌ ధాటికి కేవలం 130 పరుగులకే చాపచుట్టేసింది.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది. 

ఈ విషయం పక్కనబెడితే.. కోహ్లి చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాటింగ్‌ సమయంలో 81 బంతులకు బౌండరీ బాదిన సమయంలో సెంచరీ మార్క్‌ సాధించినంత సెలబ్రేషన్‌ చేసుకొని అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా విండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో విరాట్‌ కోహ్లి డ్యాన్స్‌ మూమెంట్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ను తలపిస్తూ మంచి రిథమ్‌తో మూన్‌వాక్‌ చేయడంతో బాంగ్రా స్టెప్స్‌తోనూ అలరించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న జైశ్వాల్‌ ఇదంతా గమనిస్తూ తనలో తాను నవ్వుకోవడం విశేషం. కోహ్లి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను ఫ్యాన్‌కోడ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

చదవండి: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్‌ విజయం

Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌కు చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement