Virat Kohli And Anushka Sharma Buy An 8-Acre Land In Alibaug, Check Here Land Worth - Sakshi
Sakshi News home page

Virat Kohli: భార్య అనుష్కతో కలిసి ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేసిన కోహ్లి.. ధర ఎంతంటే!

Published Sat, Sep 3 2022 12:17 PM

Virat Kohli Anushka Sharma Buy 8 Acre Land Near Alibaug Worth Is - Sakshi

Virat Kohli- Anushka Sharma: టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మహారాష్ట్రలోని అలీబాగ్‌లో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు సమాచారం. భార్య అనుష్క శర్మతో కలిసి దాదాపుగా ఎనిమిది ఎకరాల భూమిని అతడు కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విరుష్క దంపతులు సుమారుగా పందొమ్మిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. 

సంపాదనలో టాప్‌లోనే
కాగా భారత జట్టులో కీలక ఆటగాడైన కోహ్లికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అనుష్క శర్మ సైతం సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సెలబ్రిటీ జంట సంపాదన కూడా అదే రేంజ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో కోహ్లి ఇప్పటికే 'వన్‌8' బ్రాండ్‌ పేరిట ఇప్పటికే క్లాత్‌, షూస్‌, ఆతిథ్య రంగాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు పెట్టుబడుతున్నట్లు సమాచారం.

అలీబాగ్‌లో
ఈ క్రమంలో అలీబాగ్‌కు సమీపంలోని జిరాద్‌ గ్రామంలో ఫామ్‌హౌజ్‌ సొంతం చేసుకోవాలని కోహ్లి దంపతులు భావించారట. మలయాళీ మీడియా మనోరమ కథనం ప్రకారం.. కోహ్లి, అనుష్క ఆర్నెళ్ల క్రితమే జిరాద్‌ను సందర్శించి ఇందుకోసం డీల్‌ కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యారట. విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం.

ఈ లావాదేవీలకు సంబంధించి కోహ్లి దంపతులు 1.15 కోట్ల రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. గురువారమే ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైనట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. కాగా కోహ్లి ప్రస్తుతం ఆసియాకప్‌-2022 టోర్నీతో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అర్ధ శతకం బాది అభిమానులను అలరించాడు.

ఇదిలా ఉంటే.. ముంబైలో గల.. బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ కిషోర్‌ కుమార్‌కు చెందిన బంగ్లాలో కోహ్లి తన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  

చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌.. సూపర్‌-4 షెడ్యూల్‌ ఇదే
Aus Vs Zim 3rd ODI: సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే.. సంచలన విజయం

Advertisement
 
Advertisement
 
Advertisement