హార్ట్‌ బ్రేకింగ్‌.. వైభ‌వ్ మ‌రో 'సారీ' | Vaibhav Sooryavanshi livid with himself after 96 vs GT | Sakshi
Sakshi News home page

IPL 2026: హార్ట్‌ బ్రేకింగ్‌.. వైభ‌వ్ మ‌రో 'సారీ'

May 29 2026 10:40 PM | Updated on May 29 2026 10:53 PM

Vaibhav Sooryavanshi livid with himself after 96 vs GT

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 97 పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయిన వైభవ్‌.. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్‌పై అదే సీన్ రిపీట్ చేశాడు. 

ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్‌తో క్వాలిఫయర్‌-2లో వైభవ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను వైభవ్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ సులువుగా తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ మరోసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వైభవ్ నిలిచిపోయాడు.

రబాడ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి థర్డ్‌మ్యాన్‌లో వైభవ్‌ దొరికపోయాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ ఈ విధంగానే అతడు తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్‌ అయిన బ్యాటర్ల సరసన వైభవ్ చేరాడు. డేవిడ్ వార్నర్, కె.ఎల్ రాహుల్ లాంటి దిగ్గజాల రికార్డును అతను సమం చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్లు వీరే
వైభవ్ సూర్యవంశీ-3
డేవిడ్‌ వార్నర్‌-3
కేఎల్‌ రాహుల్‌-3
గ్లెన్‌ మాక్స్‌వెల్‌-3
రుతురాజ్‌ గైక్వాడ్‌-3
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement