IPL 2022: 'ఉమ్రాన్ మాలిక్ హ‌రికేన్‌'.. ప్ర‌శంస‌లు కురిపించిన మాజీ కేంద్ర మంత్రి

Umran Malik hurricane is blowing away everything - Sakshi

ఐపీఎల్‌--2022లో భాగంగా బుధవారం(ఏప్రిల్‌ 27) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.  తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ అందుకున్న ఐదో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అనూహ్యంగా ఓటమి పాలైనప్పటికీ.. మాలిక్ బౌలింగ్‌కు అభిమానులు సలాం కొడుతున్నారు.

ఈ క్రమంలో మాలిక్‌పై ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మాలిక్‌ను ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి  పి చిదంబరం ట్విట్‌ చేశారు." ఉమ్రాన్‌ మాలిక్‌ తుపాన్‌ బౌలింగ్‌ ధాటికి ఎవరూ నిలవలేరు. అతడి బౌలింగ్‌లో వేగం‌, దూకుడు  ఆక‌ట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శన ఈ ఏడాది సీజన్‌కే హైలెట్‌గా నిలుస్తోంది. అదే విధంగా మాలిక్‌కు ఓ ప్రత్యేకమైన కోచ్‌ను ఏర్పాటు చేసి, అతడికి భారత జట్టులో చోటు కల్పించాలని" చిదంబ‌రం పేర్కొన్నారు.

చదవండి: Marco Jansen: ఐపీఎల్‌ చరిత్రలో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ చెత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top