నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ క్రికెటర్‌

Umar Akmal gets Teary after recalling Hard time during Ban - Sakshi

ఉమర్‌ అక్మల్‌.. పాకిస్తాన్‌ తరపున సత్తా చాటి కనుమరుగు అయిపోయిన క్రికెటర్లలో ఒకడు. పాకిస్తాన్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ సోదురుడే ఈ ఉమర్‌ అక్మల్‌. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగిన అక్మల్‌.. అన్నకు తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నాడు. అయితే పాక్‌ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న తరణంలో ఉమర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకుని తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. 

2020లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తనని సంప్రదించిన విషయాన్ని దాచిన  అ‍క్మల్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. అయితే అదే ఏడాది తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ అక్మల్‌ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించాడు.

ఈ క్రమంలో అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ న్యాయస్ధానం తీర్పు వెల్లడించింది. దీంతో అతడిపై 2021లో పీసీబీ నిషేదం ఎత్తివేసింది. అయితే ఆ తర్వాత అతడికి పాక్‌ జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉమర్‌.. తనపై నిషేదం ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఆమె చాలా గ్రేట్‌..
"ఆ సమయంలో నేను పడిన బాధ నా శత్రువులకు కూడా కలగకూడదు. ఆ దేవుడు కొన్ని సమయాల్లొ మనల్ని పరీక్షిస్తాడు. నా రోజులు బాగోలేక నేను గడ్డుపరిస్ధితులు ఎదుర్కొన్నప్పుడు.. చాలా మంది అసలు రూపం బయటపడింది. నన్ను తప్పుబడుతూ నా పక్కన ఉన్నవారు కూడా వెళ్లిపోయారు. నేను ఆ సమయంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

నా కూతరి ఫీజు కట్టలేక ఎనిమిది నెలల పాటు స్కూల్‌కి పంపలేకపోయాను. అదే విధంగా నా భార్య  ఓ సుసంపన్న కుటుంబంలో పుట్టింది. అయినప్పటికీ ఆ క్లిష్ట పరిస్ధితుల్లో ఆమె నన్ను అర్ధం చేసుకుని లా సపోర్ట్‌గా ఉండేది. ఆమెకి ఎప్పటికి రుణపడి ఉంటాను.  ఆ రోజుల గురించి తలచుకున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ అక్మల్‌  ఉద్వేగానికి లోనయ్యాడు.
చదవండిWorld Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్‌ ఆటగాళ్లకు నో ఛాన్స్‌! సంజూకు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top