Tokyo Olympics: కండోమ్‌లు ఇస్తాం.. కానీ, వాడొద్దు

Tokyo Olympics No Condoms Usage In Athletic Village - Sakshi

టోక్యో: సమ్మర్‌ ఒలంపిక్స్‌ 2020(2021) నిర్వాహకులు ఆటగాళ్లకు ఒక ముఖ్యమైన గమనిక తెలియజేశారు. ఒలంపిక్‌ విలేజ్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ అమలులో ఉన్నందున అథ్లెట్స్‌ కండోమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా వాటిని తమ వెంట ఇంటికి(స్వంత దేశాలకు) తీసుకెళ్లొచ్చని తెలిపారు.

ఒలంపిక్స్‌ నేపథ్యంలో ఆటగాళ్లకు కండోమ్‌లు సరఫరా చేస్తుండడం షరా మామూలే. 1988 సియోల్‌ ఒలంపిక్స్‌ నుంచి హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ పని చేస్తున్నారు. అయితే కరోనా నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నామని, అందుకే కండోమ్‌లు ఇంటికి తీసుకెళ్లాలని ఈసారి ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఓ ప్రముఖ మీడియా హౌజ్‌ అడిగిన ప్రశ్నకు కమిటీ సీఈవో తోషిరో ముటో బదులిచ్చారు. 

ఇదిలా ఉంటే ఈసారి ఆటగాళ్ల కోసం లక్షా యాభై వేల కండోమ్‌లను నిర్వాహకులు సిద్ధం చేశారు. కాగా, తాజా ప్రకటనతో ఆటగాళ్లు దూరంగా ఉండాలని, ఒలంపిక్‌ విలేజ్‌లో శృంగారంలో పాల్గొనడానికి వీల్లేదని పరోక్షంగా హింట్‌ ఇచ్చారు. ఇక కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆటగాళ్లకు భోజన సదుపాయాలు అందించడం దగ్గరి నుంచి ప్రతీది ఈసారి ఛాలెంజింగ్‌గా ఉండబోతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం విధించారు కూడా.

చదవం‍డి: మాకొద్దీ చైనా దుస్తులు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top