అర్జున్‌కు తొలి విజయం | Telangana Chess GrandMaster Eragasi Arjun Won Against Max Warmerdem | Sakshi
Sakshi News home page

అర్జున్‌కు తొలి విజయం

Jan 17 2022 4:28 AM | Updated on Jan 17 2022 4:29 AM

Telangana Chess GrandMaster Eragasi Arjun Won Against Max Warmerdem - Sakshi

టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ తొలి విజయం నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్‌ 25 ఎత్తుల్లో మాక్స్‌ వార్మెర్‌డమ్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచాడు. లుకాస్‌ వాన్‌ ఫారెస్ట్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన తొలి గేమ్‌ను అర్జున్‌ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement