జీవాపై కామెంట్లు చేసిన బాలుడు అరెస్ట్‌

teenager arrested for posting abusive comments on ziva dhoni - Sakshi

అహ్మదాబాద్‌‌: మహేంద్ర సింగ్‌ ధోని కూతురు జీవా ధోనిపై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు గుజరాత్‌లోని కచ్‌ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోని తీసుకొని విచారించగా, ఆ పోస్ట్‌ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం నిందితుడిని వారికి అప్పగి​స్తామని కచ్‌ జిల్లా (వెస్ట్‌) ఎస్పీ సౌరబ్‌ సింగ్‌ తెలిపారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయిందని, మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేశారు.  (జీవా ధోనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు)

(చదవండిరాయల్స్‌ రైజింగ్‌..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top