సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్‌ ఆనంద్‌ ఓటమి | Sakshi
Sakshi News home page

సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్‌ ఆనంద్‌ ఓటమి

Published Sun, Jul 9 2023 1:45 PM

Teenaged Grandmaster Dommaraju Gukesh defeats idol Viswanathan Anand - Sakshi

భారత చెస్‌ దిగ్గజం.. ఐదుసార్లు చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు షాక్‌ తగిలింది.  భార‌త 17 ఏళ్ల గ్రాండ్ మాస్ట‌ర్ దొమ్మ‌రాజు గుకేశ్ దిగ్గజంతో తలపడిన తొలి మ్యాచ్‌లోనే విజ‌యం సాధించ‌డం విశేషం. విషయంలోకి వెళితే.. క్రోయేషియా రాజ‌ధాని జ‌గ్రెబ్‌లో జ‌రుగుతున్న‌ సూప‌ర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ క్రొయేషియా 2023 పోటీల్లో గుకేశ్, ఆనంద్ పోటీ ప‌డ్డారు.

‘ఈ విజ‌యం చాలా ప్ర‌త్యేకమైన‌ది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఆడ‌తాన‌ని తెలుసు. అయితే. ఆనంద్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. నేను ఎంత‌గానో ఆరాధించే ఆట‌గాడిపై విజ‌యం చాలా స్పెష‌ల్‌గా అనిపిస్తోంది’ అని గుకేశ్ అన్నాడు. అయితే.. 10 పాయింట్లు సాధించిన ఈ ఇద్ద‌రూ నాలుగో స్థానంలో నిలిచారు.

చెన్నైకి చెందిన గుకేశ్‌కి విశ్వ‌నాథ‌న్ ఆనంద్ అంటే చాలా ఇష్టం. అత‌డిని చూస్తూ పెరిగిన గుకేశ్ పెద్ద‌య్యాక చెస్ ప్లేయర్ కావాల‌నుక‌న్నాడు. అండ‌ర్ -13 చాంపియ‌న్‌గా నిలిచాడు. అయితే.. ప్ర‌పంచంలో అతి చిన్నవ‌య‌సులోనే గ్రాండ్ మాస్ట‌ర్‌గా రికార్డు చేజార్చుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నెల‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్-1 మాగ్న‌స్ కార్లోసన్‌(Magnus Carlsen)ను ఓడించి మ‌రోసారి ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాడు. ఈరోజు ఆనంద్‌పై పైచేయి సాధించి త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు.

చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్‌ దిగ్గజం

Advertisement

తప్పక చదవండి

Advertisement