సెమీస్‌లో తన్వీ, ఇషారాణి ఓటమి | Tanvi and Isharani Defeated in Semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తన్వీ, ఇషారాణి ఓటమి

Mar 22 2026 3:34 AM | Updated on Mar 22 2026 3:34 AM

Tanvi and Isharani Defeated in Semifinals

న్యూఢిల్లీ: ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్స్‌ తన్వీ శర్మ, ఇషారాణి బారువా ఓటమి పాలయ్యారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో జరిగిన తొలి సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 9–21, 16–21తో ఓడిపోయింది. 

రెండో సెమీఫైనల్లో ఇషారాణి 12–21, 21–23తో పిచామన్‌ ఒపాట్‌నిపుత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ఓడిన తనీ్వ, ఇషారాణిలకు 3,625 డాలర్ల (రూ. 3 లక్షల 39 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 4900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement